ఆ డైరెక్టర్ కొడుకుతో హేమ కూతురి పెళ్లి ఫిక్స్?

టాలీవుడ్‌లో మోస్ట్ పావులర్ డైరెక్టర్లలో ఒకరు పూరి జగన్నాథ్. పూరి కుమారుడు ఆకాష్ పూరి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే పలు సినిమాలు చేశాడు. అయితే టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూతురిని ఆకాష్ పూరి పెళ్లాడనున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వారిద్దరు ఎప్పటినుంచో మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నారు.

hema daughter isha

దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతోంది. తాజాగా ఈ వార్తలపై హేమ స్పందించింది. తనకి దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నయ్యతో సమానమని, అందువల్లనే చాలా చనువుగా ఉంటానని చెప్పింది. అలాగే తన కూతురు ఇషాని ఆకాష్ పూరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో అవాస్తవం లేదని హేమ తెలిపింది.

పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని ఇటీవలే తన కూతురు చెప్పిందని హేమ తెలిపింది. ఒకవేళ ఆమె ఎవరినైనా ప్రేమించినప్పటికీ తన కూతురి అభిప్రాయాన్ని గౌరవిస్తానంది. అప్పట్లో పూరి జగన్నాథ్ పెళ్లి చేసే సమయంలో తాను సహాయం చేసిన మాట నిజమేనని తెలిపింది. అలాగే పూరి జగన్నాథ్ తన ఇంటి వద్దనే ఉండేవాడని అతడి గురించి అన్నీ తెలియడంతోనే ప్రేమ పెళ్లికి చేసుకునేందుకు సహాయం చేసానని హేమ చెప్పింది.