ప్రేమ మీద అందుకే నమ్మకం అంటున్న రకుల్

టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ ఎవరంటే.. రకుల్ ప్రీత్ సింగ్ అని చెబుతారు. టాలీవుడ్‌లో స్టార్ హీరోల అందరి సరసన సినిమాలు చేసింది ఈ అమ్మడు. వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న ఈ బ్యూటీ. ఇటీవల ఫ్యామిలీతో కలిసి మాల్ధీవులకు వెళ్లిన విషయం తెలిసిందే. మాల్ధీవుల్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

rakul preeth singh

అయితే తాజాగా మాల్ధీవుల పర్యటనను పూర్తి చేసుకుని రకుల్ ఇండియాకు తిరిగి వచ్చింది. అయితే పేరెంట్స్ 31వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు వారిని మాల్ధీవుల పర్యటనకు తీసుకెళ్లింది. అక్కడ వారి వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో తన పేరెంట్స్ సాయంత్రం వేళ ఎంతో ఆనందంగా క్యాంప్ ఫైర్ పెట్టి డ్యాన్సులు వేస్తున్నారు

ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది రకుల్ ప్రీత్. నాకు ప్రేమ పైన నమ్మకం కలగడానికి కారణం వీరిద్దరే అంటూ పోస్ట్ చేసింది. మాల్ధీవుల పర్యటనకు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వస్తున్నట్లు చెప్పింది.