మహేష్ బాబు@ 6 మిలియన్స్

సినిమాల పరంగానే కాదు.. సోషల్ మీడియాలో కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు రికార్డులు సృష్టిస్తున్నాడు. సోషల్ మీడియాలో మహేష్ బాబు ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడనే విషయం తెలిసిందే. తన సినిమాలకు సంబంధించిన పోస్టులతో పాటు ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటాడు. తన ఫ్యామిలీతో వెకేషన్లకు వెళ్లిన ఫొటోలను మహేష్ బాబు ఎప్పుడూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటాడు.

instragram

ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో మహేష్ బాబు మరో మైలురాయిని అందుకున్నాడు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో మహేష్ బాబు అధికారిక అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య ఆరు మిలియన్లకు చేరుకుంది. దీంతో ఈ విషయాన్ని మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు. లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో మహేష్ సినిమా చేయున్నాడని ప్రచారం జరుగుతోంది.