‘మాయావన్’ స్ట్రైకింగ్ టీజర్ విడుదల

హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ సివి కుమార్ వారి కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ హిట్ ప్రాజెక్ట్‌జెడ్/మాయవన్‌ తర్వాత సెకండ్ పార్ట్ కోసం మరోసారి చేతులు కలిపారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ‘మాయవన్‌’ పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మాయవన్ వరల్డ్ నేపధ్యంలో వుంటుంది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ను అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పిస్తోంది. రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. కిషోర్ గరికిపాటి (జికె) ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

హీరో సందీప్ కిషన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు వారు సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్  మాయవన్ ప్రపంచాన్ని, అందులోని ప్రధాన పాత్రలను కూడా పరిచయం చేస్తుంది. మంచులో ఉన్న సైన్స్ ల్యాబ్‌ను చూపడంతో టీజర్ ఓపెన్ అయ్యింది. అక్కడ మెదడును ఒక వ్యక్తి నుండి మరొకరికి బదిలీ చేయడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి.

నీల్ నితిన్ ముఖేష్ పోషించిన సూపర్‌విలన్‌కు సూపర్ పవర్స్ ఉన్నాయి, అయితే సందీప్ కిషన్ పోషించిన సామాన్యుడు కూడా చివరికి కొన్ని పవర్స్ తో వస్తాడు. ఆకాశ రంజన్ కపూర్‌తో సందీప్ కిషన్ లవ్ ట్రాక్‌ను కూడా చూపించారు. టీజర్ ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్‌తో యాక్షన్-ప్యాక్డ్ నోట్‌తో ముగుస్తుంది. టీజర్ సినిమాపై చాలా క్యురియాసిటీని కలిగిస్తుంది.

సందీప్ కిషన్ అద్భుతమైన స్టంట్స్ చేస్తూ మ్యాన్లీగా కనిపించారు. సి.వి.కుమార్ వండర్ ఫుల్ వరల్డ్ ని సృష్టించారు. విజువల్స్ కన్నుల పండగలా వున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

తారాగణం:సందీప్ కిషన్, ఆకాంక్ష రంజన్ కపూర్, నీల్ నితిన్ ముఖేష్, కాథరిన్ డేవిసన్, పృధ్వీ రాజ్, బబ్లూ పృథివీరాజ్,  మురళీ శర్మ, అనీష్ కురువిల్లా, మురళీధర్ గౌడ్, సత్య ప్రకాష్

టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: సివి కుమార్
నిర్మాత: రామ బ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
ప్రెజెంట్స్: అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గరికిపాటి కిషోర్
డీవోపీ: కార్తీక్ తిల్లై & కవిన్ రాజ్.
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటర్: రవి తేజ గిరిజాల
ఆర్ట్ డైరెక్టర్: ప్రేమ్ కరుంతలై.
డిజైనర్: అనంత్ కంచెర్ల (పద్మశ్రీ యాడ్స్)
పీఆర్వో: వంశీ శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా