జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న సినీ ప్రముఖులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరనున్నాయి. అయితే 2019 లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి వైస్సార్సీపీ ప్రభుత్వం పై అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాకుండా ఇటు తెలుగు సినీ పరిశ్రమ కూడా ఇబ్బంది పడింది. గత 5 సంవత్సరాలలో ఆంధ్ర ప్రదేశ్ కు అభివృద్ధి ఏమి చేయకపోగా సినిమా ఇండస్ట్రీకి కూడా ఈ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు తెచ్చి పెట్టింది. అయితే అందులో ప్రధానంగా సినిమా టిక్కెట్ల రేట్లు నుండి మొదలై సినీ ప్రముఖులను అవమానించడం, ఇంకా మరెన్నో ఉన్నాయి అంటున్నరు కొందరు సినీ ప్రముఖులు. ఇది ఇలా ఉండగా కొంత మంది సినీ ప్రముఖులు జగన్ రెడ్డి ప్రభుత్వం గురించి కొన్ని ప్రకారణాలు ఇచ్చారు.

జగన్ రెడ్డి కోసం మా కుటుంబం రోడ్డెక్కితే, ఈ రోజు మమ్మల్ని నడిరోడ్డున పడేశాడు. ఫీజు రీయింబర్మెంట్ నిధులు విడుదల చేయకుండా మా శ్రీవిద్యానికేతన్, మోహన్ బాబు యూనివర్సిటీ సంక్షోభానికి జగన్ రెడ్డే ప్ర ధాన కారణం. దయచేసి వైసీపీని నమ్మకండి. టిడిపి,బిజెపి,జనసేన కూటమికి మద్దతివ్వండి – మంచు విష్ణు

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే టాలీవుడ్కి ఎంతో గౌరవం ఇచ్చేవారు. టిడిపి అంటేనే బీసీల పార్టీ అనే పేరుంది. ఒక బీసీగా నాకు టిడిపి అంటే చాలా ఇష్టం. మా మామయ్య కొండయ్య యాదవ్క చీరాల టికెట్ ఇచ్చి యాదవులకు సముచితస్థానం కల్పించారు. టిడిపిని గెలిపించాలని కోరుతున్నాను – నిఖిల్ సిద్ధార్థ్

జగన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఏపీలో అంతా బాధపడుతున్నారు. జగన్ భూకబ్జాలకు ప్రత్యక్ష బాధితుడిని నేను. వ్యాపారాల వల్ల జగన్ రెడ్డితో నాకు స న్నిహితసంబంధాలున్నాయి. నాకు ఖమ్మంలో 500 ఎక రాల ఆస్తి ఉందని తెలుసుకున్న జగన్, తనకు కావాలని బ లవంతంగా లాగేసుకున్నాడు. నాలాంటి బాధితులంతా టిడిపికి ఓటేయాలని కోరుతున్నాను – అక్కినేని నాగార్జున

జగన్ పాలనలో నేనూ ఒక బాధితుడిని. ధమాకా సినిమా టికెట్ రేటు పెంచాలని కోరితే, పవన్ కళ్యాణ్ తో మా ప్రొడ్యూసర్ సినిమా తీశాడనే కక్షతో టికెట్ రేట్లు తగ్గించేశాడు. సినిమా హిట్ అయినా కలెక్షన్లు రాలేదు. రాజకీయాలకు సంబంధంలేని మావంటి వారిపై పగబట్టి సాధిస్తున్న జగన్ రెడ్డిని ఓడించాలని పిలుపునిస్తున్నాను – రవి తేజ

శ్రీవారి సేవా భాగ్యం దక్కిందన్న సంతోషం జగన్ రెడ్డి కుట్రలతో దూరమైంది. పవిత్రమైన తిరుమల కొండపై ఎస్వీబీసీలో జగన్ రెడ్డి మనుషుల అసాంఘిక కార్యక లాపాలు అడ్డుకున్నానని కక్ష కట్టి కుట్రలకు బలి చేశారు. హిందూ ధర్మానికే ప్రమాదం తలపెట్టిన వైసీపీని ఓడిద్దాం-ధర్మాన్ని పరిరక్షించే కూటమిని గెలిపిద్దాం – పృథ్వి రాజ్

సినీ పరిశ్రమ మంచి కోసం ఒక మెట్టు దిగి సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్లడం మేము చేసిన చారిత్రక తప్పిదం. నా జీవితంలో జగన్ మోహన్ రెడ్డి చేసిన అవమానాన్ని మరిచిపోలేను. నాతోపాటు మిగిలిన ప్రముఖహీరోలను దారుణంగా అవమానించాడు. ఇటువంటి వ్యక్తి మనకే కాదు ఏ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండకూడదు – చిరంజీవి

రమేష్ హాస్పిటల్ లో జరిగిన షార్ట్ సర్క్యూట్ ప్ర మాదాన్ని మా పెదనాన్నకు, కమ్మవాళ్లకు, తద్వారా తెలుగుదేశం పార్టీకి ఆపాదించి జగన్ రెడ్డి ఆదేశాలతో వైసీపీ విషప్రచారం చేసింది. ప్రజల సంక్షేమం విస్మ రించి కుల,మత,ప్రాంతాల విద్వేషాలు రెచ్చగొట్టే వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించండి – రామ్ పోతినేని

సినీ పరిశ్రమ పెద్దల భేటీలో నువ్వెవరు అని నన్నే జగన్ మోహన్ రెడ్డి అడిగాడు. బాహుబలితో ప్రపంచమే నన్ను గుర్తించింది. ఈ జగన్ రెడ్డి గుర్తించకపోతే నాకు నష్టంలేదు. ఇది నాకు చేసిన అవమానం కాదు, టాలీవుడ్కి చేసిన అవమానం. ఇటువంటి అహంకారి పాలకుడు కావడం రాష్ట్రానికి, ప్రజలకు తీవ్ర నష్టం. సినీకళాకారులను గౌరవించే చంద్రబాబుగారిని ఎన్నుకోండి – రాజమౌళి

పవన్ కళ్యాణ్ గారితో నా స్నేహసంబంధం అక్షరం-సాహిత్యం బంధంలాంటిదే. ఆయనపై అభిమానంతో నేను ఓ పాట రాశాను. వైసీపీ సోషల్మీడియాలో నా పేరు, పర్సనల్ ఫోన్ నెంబరు పెట్టారు. అగంతకుల నుంచి దాదాపు 5 వేల కాల్స్. తిట్లు, శాపనార్థాలు. పవ న్ కళ్యాణ్ గారికి పాట రాయడం దేశద్రోహం కాదుకదా! ఏపీ పాలిట ఉగ్రవాదుల్లారా మారిన వైసీపీని ఓడించండి. టిడిపి,బిజెపి,జనసేనని గెలిపించండి – త్రివిక్రమ్