పవన్ అభిమానులకు డబుల్ ధమాకా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలో వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఏప్రిల్ 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌లో పవన్ నటిస్తున్నాడు. ఇందులో దగ్గుబాటి రానా కూడా కీలక పాత్రలలో నటిస్తున్నాడు. సాగర్ కె చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించనున్నాడు.

AYYAPPANUM KOSHIYAM RELEASE DATE

పీడీవీ ప్రసాద్ సమర్పణలో సీతార ఎంటర్‌టైన్‌మ్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఏడాదిలోనే వినాయక చవితి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో పవన్ మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.