Tollywood: నేడు మెగాఅల్లుడు క‌ళ్యాణ్‌దేవ్ బ‌ర్త్‌డే.. తాజా చిత్రం పోస్ట‌ర్ రిలీజ్‌!

Tollywood: మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా విజేత సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మ‌య్యాడు క‌ళ్యాణ్‌దేవ్‌. నేడు క‌ళ్యాణ్‌దేవ్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. తొలి సినిమా విజేత తోనే న‌టుడిగా మంచి మార్కులు కొట్టేసాడు ఈ మెగా అల్లుడు.. ప్ర‌స్తుతం క‌ళ్యాణ్‌దేవ్ వ‌రుస సినిమాల‌తో ఫుల్ జోష్ మీదున్నాడు. తాజాగా తాను న‌టించిన సూప‌ర్‌మ‌చ్చి చిత్రం నుంచి ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు చిత్ర‌బృందం.

firstlook

ఈ చిత్రాన్ని పులివాసు డైరెక్ట్ చేస్తుండ‌గా.. Tollywood రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై రిజ్వాన్‌, ఖుషి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో క‌ళ్యాణ్‌దేవ్‌కు జోడీగా ర‌చితారామ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. Tollywood ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్‌ను రిలీజ్ చేస్తూ హ్యాపీ బ‌ర్త్‌డే క‌ళ్యాణ్‌దేవ్ అని శుభాకాంక్ష‌లు తెలిపారు చిత్ర‌బృందం. ఆ తర్వాత వ‌చ్చే సినిమా కిన్నెర‌సాని ఇటీవ‌లే పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. కాగా తొలి సినిమాకే న‌టుడిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ మెగా అల్లుడు త‌న త‌ర్వాత Tollywood సినిమాల‌తో మ‌రింత మంచి గుర్తింపు తెచ్చుకోవాల‌ని, మ‌రెన్నో స‌క్సెస్ ఫుల్ సినిమాల్లో న‌టించాల‌ని ఆశిస్తూ..టీఎఫ్‌పీసీ త‌ర‌పున హ్యాపీ బ‌ర్త్‌డే క‌ళ్యాణ్‌దేవ్‌.