Anasuya: ఆధ్యంతం ఆక‌ట్టుకుంటున్న‌ అన‌సూయ థ్యాంక్యూ బ్ర‌ద‌ర్ ట్రైల‌ర్‌..

Anasuya: బుల్లితెర వ్యాఖ్య‌త‌గా తెలుగు తెర‌పై ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన అన‌సూయ భ‌ర‌ద్వాజ్ తాజాగా థ్యాంక్యూ బ్ర‌ద‌ర్ అనే సినిమాలో న‌టిస్తోంది. గ‌తంలో క్ష‌ణం, రంగ‌స్థ‌లం సినిమాల్లో అన‌సూయ న‌టించి ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. అన‌సూయ ఓ వైపు బుల్లితెర‌పై మెరిపిస్తూనే.. ప‌లు సినిమాల్లో న‌టిస్తుంది ఈ భామ‌. అయితే అన‌సూయ ప్ర‌స్తుత చిత్రం థ్యాంక్యూ బ్ర‌ద‌ర్ ట్రైల‌ర్‌ను ఇవాళ రిలీజ్ చేశారు చిత్ర‌బృందం.

anasuya latest movie

Anasuya ఆమె ప్ర‌ధాన పాత్ర‌ల్లో కొత్త ద‌ర్శ‌కుడు ర‌మేశ్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో.. జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తార‌క్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో Anasuya గ‌ర్భిణీ మ‌హిళ‌గా అన‌సూయ క‌నిపిస్తుండ‌గా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా విక్ట‌రీ వెంక‌టేశ్ గారితో రిలీజ్ చేయించారు చిత్ర‌బృందం. ఇక ఈ సినిమాలో మ‌రో ప్ర‌ధాన పాత్ర‌ల్లో అశ్విన్ న‌టిస్తుండ‌గా.. ఈ చిత్ర ట్రైల‌ర్‌లో అన‌సూయ‌-అశ్విన్ అద‌ర‌గొట్టారు. ప్రెగ్నెంట్‌గా ఉన్న అన‌సూయ లిఫ్ట్‌లో అశ్విన్‌తో పాటు ఇరుక్కుంటుంది. ఇంత‌లో Anasuya ఆమెకు పురిటినొప్పులు రావ‌డంతో అశ్విన్ ఏమ్‌చేయాల‌నే ఆలోచ‌న‌తో Anasuya: అన‌సూయ ఫోన్ నుంచి సోష‌ల్ మీడియా ద్వారా లైవ్ ఇస్తుంటాడు. మ‌రీ చివ‌ర‌కు Anasuya అన‌సూయ ఆ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డిందా, త‌ర్వాత ఏం జ‌ర‌గ‌నుంది అనే స‌స్పెన్స్‌తో ఈ ట్రైల‌ర్ సాగుతోంది.. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లే పూర్తి చేసుకోగా.. త్వ‌ర‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.