రానా ‘విరాటపర్వం’ రిలీజ్ డేట్ వచ్చేసింది

వరుస సినిమాలు వస్తూ బిజీబిజీగా ఉన్నాడు దగ్గుబాటి రానా. ప్రస్తుతం రానా-సాయిపల్లవి కాంబినేషన్‌లో విరాటపర్వం సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ ఏడాది ఏప్రిల్ 30న విరాటపర్వం విడుదల చేయనున్నట్లు సురేష్ ప్రొడక్షన్స్ ట్విట్టర్‌లో ప్రకటించింది. కామ్రేడ్ ‘రావణ’ ఏప్రిల్ 30న బిగ్ స్క్రీన్‌పై విప్లవాన్ని తెస్తోంది అని సురేష్ ప్రొడక్షన్స్ ట్విట్టర్‌లో పేర్కొంది.

Viraata Parvam On April30

ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఒకవైపు గన్ను, మరోవైపు బ్యాగ్‌తో నక్సలైట్ లుక్‌లో రానా కనిపించాడు. వేణు ఊడుగుల ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా.. ఇందులో కామ్రేడ్ భారతక్కగా ప్రియమణి నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. నందితాదాస్, నవీన్ చంద్ర, జరీనా వాహబ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.