Acharya: మెగాస్టార్ ఆచార్య టీజ‌ర్‌కు ముందే ఓ వీడియోను రిలీజ్ చేశారు..

Acharya: మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఆచార్య చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్ట‌ర్లు అభిమానుల‌ను అల‌రించ‌గా.. ఈ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 29 సాయంత్రం 4.05గంట‌ల‌కు ఈ చిత్ర టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. రేపు ఈ చిత్ర టీజ‌ర్ రిలీజ్ కానున్న నేప‌థ్యంలో అంత‌కుముందే కొణిదెల ప్రొ కంపెనీ నుంచి ఈ Acharya చిత్ర మేకింగ్ వీడియోను షేర్ చేసింది.

chiru

ధ‌ర్మ‌స్థ‌లి ప్ర‌పంచంలోకి వెళ్లేముందు సంగ్ర‌హావ‌లోక‌నం అంటూ ట్వీట్ చేసింది. Acharya ధ‌ర్మ‌స్థ‌లికి రేపు త‌లుపులు తెరుచుకుంటున్నాయ‌ని వెల్లడించింది. ఆచార్య టీజ‌ర్‌కు మార్గం సిద్ధం చేస్తున్నామంటూ ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.Acharya ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన‌ర్స్ బ్యాన‌ర్‌పై సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. మ్యూజిక్ మ్యాస్ట్రో మ‌ణిశ‌ర్మ Acharyaఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.