ఓటీటీలో దేవరకొండ సినిమా

యూత్ ఐకాన్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. కమర్షియల్ కథల వైపు వెళ్లకుండా మొదటి సినిమాలో కంటెంట్ ఉండేలా చూసుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’లో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా బిగిల్ ఫేమ్ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

గుంటూరు నేపథ్యంలో సాగే మిడిల్ క్లాస్ మెలోడీస్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ హక్కులు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించిన అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ని కూడా త్వరలో అనౌన్స్ చేయనున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రొడ్యూసర్ వెనిగళ్ల ఆనంద ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మిడిల్ క్లాస్ మెలోడీస్ షూటింగ్‌ మొత్తం పూర్తి అయ్యిందని, ఆనంద్ మొదటి సినిమాకన్నా పూర్తి భిన్నమైన పాత్రలో‌ కనిపిస్తాడని, ఈ సినిమాలో వినోదంతో పాటు అందమైన ప్రేమకథ మిళితమై ఉంటుందని చెప్పుకొచ్చాడు. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో వినోద్‌ అనంతోజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.