సిల్క్ స్మిత చావుకి కారణం అదే

90’స్ లో తెలుగు తమిళ సినీ అభిమానులకు గ్లామ్ డాల్ గా పేరు తెచ్చుకున్న అమ్మాయి సిల్క్ స్మిత. విజయలక్ష్మి వడ్లపట్లగా పుట్టి సిల్క్ స్మితగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాల పాటు బోల్డ్ & గ్లామరస్ పాత్రలు చేస్తూ ఎన్నో సినిమాల మార్కెట్ ని డిసైడ్ చేసింది. 1960 డిసెంబర్ 2న వెస్ట్ గోదావరి జిల్లాలోని కొవ్వలి గ్రామంలో వడ్లపట్ల శ్రీరాములు, అన్నపూర్ణలకి పుట్టిన విజయలక్ష్మి కళారంగంపై మక్కువతో ఏలూరు నుంచి మద్రాసుకు వెళ్లాక సిల్క్ స్మితగా మారి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని స్టార్ స్టేటస్ అందుకుంది.

స్టార్ గా ఒక వెలుగు వెలిగిన సిల్క్ స్మిత, హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోని చనిపోయింది. ఈ సంఘటన జరిగి నేటికి 25 ఏళ్లు గడిచాయి కానీ ఇప్పటి వరకు ఆమె అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందనే విషయం మాత్రం మిస్టరీగానే ఉండిపోయింది. 23 సెప్టెంబర్ 1996 లో స్మిత చెన్నై లోని తన అపార్ట్ మెంట్ లో చనిపోయింది. అందుకు ఖచ్చితమైన కారణం ఎవరికీ తెలియకపోయినా ఆర్థిక పరమైన సమస్యలే ఆమెని అంతటి నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించి ఉంటాయని కొందరు అనుకుంటున్నారు. మరి కొందరేమో ఇండస్ట్రీలో లవ్ ఫెయిల్ అవ్వడం, నిజానికి దూరంగా బ్రతకడం, ఆర్ధిక సమస్యలు ఇవన్నీ కలిసి స్మితకి ఊపిరిసలపనివ్వకుండా చేశాయని అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతారు. సిల్క్ స్మిత జీవితం స్ఫూర్తితో `ది డర్టీ పిక్చర్` (2011) బాలీవుడ్ లో తెరకెక్కి సౌత్ లోనూ విడుదలైంది. విద్యాబాలన్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.