అసలు ఈ హేమంత్ ఎవరు?

తమిళ సినీ నటి వీజే చిత్ర ఆత్మహత్య కేసులో రోజుకో పరిణామం చోటుచేసుకుంటుంది. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు లోతుగా విచారణ చేపడుతుండగా.. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి భర్త వేధింపులే కారణమని తేల్చారు. దీంతో చిత్ర భర్త హేమంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కొన్ని సీరియళ్లలో అభ్యంతకర సన్నివేశాల్లో చిత్ర నటించినట్లు తెలుస్తోంది. దీని పట్ల ఆగ్రహంతో ఉన్న హేమంత్.. చిత్రతో రోజూ గొడవ పడేవాడని పోలీసులు తేల్చారు.

CHITRA HEMANTH

చిత్ర ఆత్మహత్య కేసులో హేమంత్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో అతడి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. హేమంత్ చెన్నైకి చెందిన ఒక బిజినెస్ మెన్. తొలుత ఒక పరిచయస్తుడిగా చిత్రను కలిశాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. దీంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకోవడంతో.. ఆగస్టులో లాక్‌డౌన్ సమయంలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. వీరిద్దరు తమ వివాహాన్ని ఇంతకుముందే రిజిస్టర్ చేయించుకున్నారు.

త్వరలోనే పెళ్లి చేసుకోవాలని వీరిద్దరు అనుకున్నారు. ఇంతలోపే చిత్ర ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.
హేమంత్‌ది మంచి కుటుంబమే అని తెలుస్తోంది. అతని తండ్రి వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత విదేశాలలో కూడా పనిచేశాడు.