థమన్ ఆ విషయం చెప్పకనే చెప్పాడా?

అల వైకుంఠపురములో… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో వస్తున్న మూడో సినిమా. అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలని క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. త్రివిక్రమ్ అరవింద సమేత సినిమాకి సూపర్ మ్యూజిక్ ఇచ్చిన థమన్, ఈ మూవీకి కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే థమన్, రీసెంట్ గా ఒక ఫోటో ట్వీట్ చేశాడు. తనతో పాటు బన్నీ, త్రివిక్రమ్ కూడా ఉన్న ఈ ఫోటోని పోస్ట్ చేసే సమయంలో థమన్, #NovemberComeSoon అనే ట్యాగ్ పెట్టాడు. ఈ ట్యాగ్ చూస్తే అల వైకుంఠపురములో సినిమాలో నుంచి మొదటి సాంగ్ కానీ సినిమా టీజర్ కానీ నవంబర్ లో వచ్చే అవకాశం ఉందని మెగా అభిమానులు గెస్ చేస్తున్నారు. వాళ్ల గెస్ నిజమైతే అల వైకుంఠపురములో టీజర్ ని నవంబర్ లో చూడడానికి రెడీ అయిపోవచ్చు. గతంలో అల్లు అర్జున్ కి రేస్ గుర్రం, సరైనోడు లాంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన థమన్, ఈసారి హ్యాట్రిక్ హిట్ ఆల్బమ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. థమన్ కి మాటల మాంత్రికుడితో పాటు సిరివెన్నెల కూడా కలవడంతో అల వైకుంఠపురములో సినిమాలో మంచి సాంగ్స్ ని ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు.