రౌడీ హీరో… ఇస్మార్ట్ డైరెక్టర్…

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. తనకి మాత్రమే సాధ్యమైన రైటింగ్ తో, ఎప్పటిలాగే హీరో క్యారెక్ట్రైజేషన్ ని కొత్తగా డిజైన్ చేసి పూరి, ఊరమాస్ సినిమాని చూపించి ఆల్ సెంటర్స్ లో దుమ్ము లేపే కలెక్షన్లు రాబట్టాడు. పూరి లాంటి డైరెక్టర్ కి సరైన హిట్ పడితే వసూళ్ల రేంజ్ ఏ స్థాయిలో ఉంటాయో చూపించిన ఇస్మార్ట్ శంకర్, హీరో రామ్ కి మంచి కంబ్యాక్ సినిమాగా నిలిచింది. ఈ థ్రిల్లర్ తో హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్, అదే జోష్ ని కంటిన్యూ చేస్తూ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో చెయ్ కలిపాడు. ఛార్మి, పీసీ కనెక్ట్స్ జాయింట్ వెంచర్ గా రానున్న ఈ కేజ్రీ ప్రాజెక్ట్ కి ఫైటర్ అనే టైటిల్ అనుకుంటున్నారని తెలుస్తోంది. టైటిల్ విషయం ఇంకా అఫీషియల్ గా బయటకి రాలేదు కానీ ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ వచ్చే జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

ఈ జనరేషన్ లో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకి, కెరీర్ స్టార్టింగ్ నుంచి హీరోనే రౌడీగా చూపిస్తూ వచ్చిన పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ కలిస్తే ఎలా ఉంటుందో అనే ఆలోచనే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలని పెంచింది. విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్న ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.