సాహిత్యం… సంగీతం కలిస్తే వచ్చిన మంచి పాట

కవిత నీవే, కథవు నీవే, కనులు నీవే, కలలు నీవే, కలిమి నీవే, కరుణ నీవే, కడకు నిను చేరనీయవే… మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న వాల్మీకీ సినిమాలోని క్లాస్ సాంగ్ గగన వీధిలో పాటలోని లిరిక్స్ ఇవి. సెప్టెంబర్ 30న విడుదల కానున్న వాల్మీకీ సినిమా ప్రొమోషన్స్ స్పీడ్ పెంచిన హరీశ్ శంకర్, సినిమాలోని సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేశాడు. మిక్కీ జే మేయర్ అందించిన క్లాసీ ట్యూన్ కి వనమాలి గారు రాసిన సాహిత్యం అద్భుతంగా ఉంది. మంచి సాహిత్యం, అంతకన్నా మంచి సంగీతం కలిస్తే చాలా కాలం పాటు గుర్తుండి పాటలు పుడతాయి. గగన వీధిలో సాంగ్ ఇలాంటిదే, పక్కా కమర్షియల్ సినిమాలో ఇలాంటి కూల్ సాంగ్ వినిపించడం అరుదే. కోలీవుడ్ హీరో అధర్వ, డబ్స్మాష్ ఫేమ్ మిర్నాలిని పై డిజైన్ చేసిన గగన వీధిలో పాటని విని మీరూ ఎంజాయ్ చేయండి.