అభిమానుల గురించి ఆలోచించడంలో నీ తర్వాతే ఎవరైనా…

కరోనా పాజిటివ్ వచ్చి ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఫ్యాన్స్ కి ఒక స్పెషల్ మెసేజ్ రిలీజ్ చేశారు. మాస్ కి డెమి గాడ్ లాంటి ఎన్టీఆర్ బర్త్ డే వస్తుంది అంటే మే 20న అభిమానులు చేసే సంబరాలు, సేవా కార్యక్రమాలు అన్ని ఇన్నీ కావు. ప్రతి ఏటా మే 20ని నందమూరి అభిమానులు ఒక పండగలా జరుపుకుంటారు. అవకాశం ఉన్న వాళ్లు తారక్ ఇంటి దెగ్గరికి వెళ్లి మరీ సెలెబ్రేట్ చేసుకుంటారు. అంత బాగా చేసుకునే ఈ పండగని ఎన్టీఆర్ ఈ ఏడాది చేయవద్దని అభిమానులకి సందేశం ఇచ్చాడు. కరోనాతో దేశం యుద్ధం చేస్తున్న సమయంలో సంబరాలు మంచిది కాదు, అందరూ ఇంటి దెగ్గరే ఉంటూ లాక్ డౌన్ నియమాలని పాటించాలని ఆయన సూచించాడు. త్వరలో కరోనాని జయిస్తానని చెప్పిన ఎన్టీఆర్, దేశం కరోనాని జయించిన రోజు అందరం కలిసి వేడుక చేసుకుందాం అన్నాడు. అన్న మాట దాటని లక్ష్మణుల్లాంటి అభిమానులు తారక్ చెప్పినట్లు ఇంటి దెగ్గరే ఉండండి, జాగ్రత్తగా ఉండండి. #StayHome #StaySafe