రెండు నట సింహాలు కొట్టుకుంటే ఎట్టా ఉంటాదో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని కొరటాల శివతో చేస్తున్నాడు. ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక్కడ అన్నీ రిపేర్ చేయబడును అంటూ థియేటర్స్ కి వచ్చిన ఎన్టీఆర్ కి అభిమానులు బ్రహ్మరథమే పట్టారు. కమర్షియల్ సినిమా పర్ఫెక్ట్ బ్లెండ్ విత్ ఏ స్ట్రాంగ్ మెసేజ్ లా ఉండే జనతా గ్యారేజ్ కి ఎన్టీఆర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ల స్క్రీన్ ప్రెజెన్స్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా మారింది. ఈ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్, ఇద్దరు బెస్ట్ యాక్టర్స్ ఒకే తెరపై కనిపిస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలిసేలా చేసింది. ఎన్టీఆర్ మోహన్ లాల్ ని ఒక సినిమాలోకి తెచ్చిన కొరటాల శివ, ఇప్పుడు ఇంకో కొత్త మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఎన్టీఆర్ తో తీయబోతున్న నెక్స్ట్ సినిమాలో కొరటాల శివ, మలయాళ టాప్ హీరో మమ్ముట్టిని రంగంలోకి దించబోతున్నాడు. యాత్ర సినిమాతో మళ్ళీ తెలుగు తెరపై కనిపించిన మమ్ముట్టి మరోసారి ఎన్టీఆర్ మూవీలో తెలుగులో నటించడానికి సిద్ధమవుతున్నాడట. కొరటాల చెప్పిన లైన్ నచ్చడంతో మమ్ముట్టీ ఎన్టీఆర్ అవకాశం ఉందని సమాచారం. ఇదే నిజం అయితే తెరపై రెండు నట సింహాలు కొట్టుకుంటే ఎలా ఉండబోతుందో చూడడానికి తెలుగు ప్రేక్షకులు సిద్దమవ్వాల్సిందే.