సమంతని గుర్తు పట్టడం కూడా కష్టమే…

వెబ్ సిరీస్ లవర్స్ అందరూ ఉదయాన్నే లేచి ఫోన్స్ పట్టుకోని రెడీగా ఉన్నారు దానికి కారణం వాళ్ళు ఎంతగానో వెయిట్ చేస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ రిలీజ్ అవ్వడమే. సీజన్ 1ని మించేలా తెరకెక్కించిన సీజన్ 2 ట్రైలర్ బయటకి వచ్చేసింది. మొదటి పార్ట్ కన్నా ఎక్కువ హంగామా, ఎక్కువ యాక్షన్, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ తో… మనోజ్, ప్రియమణి విడాకుల డిస్కషన్ తో మొదలైన ట్రైలర్ తీవ్రవాదిగా సమంత ఎంట్రీతో పీక్ స్టేజ్ కి వెళ్ళింది. రాజ్, డీకే టేకింగ్… ట్రైలర్ బీజీఎమ్, విజువల్స్, క్రిస్పీ డైలాగ్స్ అన్నీ కలిసి ఈ ట్రైలర్ ని సూపర్ కట్ అనిపించేలా చేసాయి. మనోజ్ బాజ్పాయ్ ముందు లుక్ లోనే ఉన్నా ఐసీస్ టెర్రరిస్ట్ గా సమంత చూపించిన మేకోవర్ అందరికీ షాక్ ఇవ్వడం గ్యారెంటీ. తన హెయిర్ స్టైల్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకూ అన్నీ కొత్తగా ఉన్నాయి. ఇప్పటివరకూ మనం చూసిన గ్లామరస్ టాప్ హీరోయిన్ సమంత ఈమెనా అనే అంతలా సామ్ లుక్ చేంజ్ చేసుకుంది. డెఫినెట్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 2 సామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలవబోతుంది. బిగ్గెర్ దాన్ ది ఫస్ట్ సీజన్ గా వస్తున్న సీజన్ 2 జూన్ 4న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవనుంది. టిల్ దెన్ హ్యావ్ ఫన్ విత్ ది ట్రైలర్.