విశ్వశాంతి విశ్వేశ్వర రావు కరోనాతో మృతి

విప్లవ భావాలతో కెరీర్ ఆరంభించి ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చిన విశ్వశాంతి విశ్వేశ్వర రావు కరోనా కారణంగా చెన్నైలో మరణించారు. కంచు కోట, నిలువుదోపిడీ, దేశోద్ధారకుడు, మార్పు, తీర్పు, హరిచంద్రుడు లాంటి హిట్ సినిమాలని నిర్మించిన విశ్వేశ్వర రావు రామారావుగారితోనే నాలుగు సూపర్ హిట్స్ ఇచ్చి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన ఈయన, అటు ఆర్ట్ సినిమాలు చేస్తూనే కమర్షియల్ కథలతో చిత్రాలు చేసి సక్సస్ సాధించాడు. నగ్నసత్యం, హరిశ్చంద్రుడు, కీర్తి కాంత కనకమ్ సినిమాలకి బెస్ట్ డైరెక్టర్ అవార్డులు అందుకున్న విశ్వేశ్వర రావుకి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 17వ నేషనల్ అవార్డ్స్ కమిటీ జ్యురీ మెంబర్ గా పని చేసిన ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటనే చెప్పాలి. ఈ కరోనా ఇంకెంతమందిని కళామతల్లి ముద్దు బిడ్డలని పొట్టన పెట్టుకుంటుందో ఏమో.