ఐసోలేషన్ నుంచే రంజాన్ శుభాకాంక్షలు…

కరోనా బారిన పడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాడు. మరో పది రోజుల పాటు ఇంటికే పరిమితం కానున్న తారక్, రంజాన్‌ పండుగ సందర్భంగా.. అభిమానులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలిపాడు. ట్విట్టర్ ద్వారా విష్ చేసిన ఎన్టీఆర్, రంజాన్‌ విషెస్తో పాటు తన హెల్త్ కండిషన్ గురించి కూడా ట్వీట్ చేశాడు. ‘అందరికీ ఈద్‌ శుభాకాంక్షలు.. అలాగే మీ స్పెషల్‌ గ్రీటింగ్స్‌ అండ్‌ ప్రేయర్లకు థ్యాంక్యూ. నేను ప్రస్తుతం బాగానే ఉన్నాను. త్వరలోనే నెగటివ్‌ వస్తుందని నమ్మకంతో ఉన్నాను. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ చేస్తున్న ఎన్టీఆర్, తర్వాత కొరటాల శివ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. మే 20న తారక్ పుట్టినరోజు సంధర్భంగా ఆర్ ఆర్ ఆర్ నుంచి స్పెషల్ పోస్టర్ తో పాటు నెక్స్ట్ మూవీకి సంబందించిన డీటెయిల్స్ కూడా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.