డోస్ పెంచింది… ఆయన చాలా సరదా అంటోంది

కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. బ్యూటీ అండ్ టాలెంట్ సరైన డోసేజ్ లో ఉన్న హీరోయిన్ కి అనుకున్నంత సక్సస్ మాత్రం రాలేదు. కెరీర్ లో ఎక్కువ శాతం ట్రెడిషనల్ రోల్స్ చేయడం, హిట్ పర్సెంటేజ్ ఎక్కువ లేకపోవడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని కాస్త లేట్ గా తెలుసుకుందో ఏమో కానీ ప్రగ్యా సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచి, తనలో ఎంత విషయం ఉందో చూపిస్తోంది. ఫోటోషూట్స్ తో అదరకొడుతూ ఫాలోవర్స్ కి కిక్ ఇస్తుంది. ఈ పెరిగిన గ్లామర్ డోస్ ప్రగ్య కెరీర్ కి ఎంత వరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.

కెరీర్ అయిపోతున్న టైంలో నందమూరి బాలకృష్ణ బోయపాటిల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ‘అఖండ’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా విశేషాలని షేర్ చేసుకుంటూ బాలకృష్ణతో యాక్ట్ చేయాలి అంటే భయపడ్డానని, ఆయనకి చాలా కోపం ఎక్కువ.. సెట్లో సైలెంట్ గా ఉండాలని తనకి చాలామంది చెప్పారని… కానీ సెట్లో బాలకృష్ణ గారు సరదాగా ఉండటం చూసి ఆశ్చర్యపోయానని ప్రగ్యా చెప్పుకొచ్చింది.. బాలయ్య కూల్ గా ఉండటంతో తనకి కాస్త ధైర్యం వచ్చిందన్న ప్రగ్య, నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఆసక్తితో ఎదురు చూస్తుందట. ఈ క్రేజీ సినిమా అయినా ప్రగ్య కెరీర్ని సెట్ చేస్తుందేమో చూడాలి.