లాక్ డౌన్ సాంగ్ రిలీజ్ చేసిన WWW టీమ్…

118 మూవీ ఫేమ్ కేవీ గుహన్ డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ హూ వేర్ వై… అదిత్, శివాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ నుంచి బయటకి వచ్చిన సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. రంజాన్ సంధర్భంగా చిత్ర యూనిట్ ఈ మూవీ నుంచి లాక్ డౌన్ అనే సాంగ్ రిలీజ్ చేశారు. రోల్ రిడా పాడిన ఈ సాంగ్ చాలా క్యాచీగా ఉంది. వైవా హర్షా, అదిత్ రోల్ రిడా కనిపించిన ఆ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మీరు కూడా ఇంట్లో సేఫ్ గా ఉండి, ఈ సాంగ్ విని ఎంజాయ్ చేయండి. #StaySafe #StayHome