హాలీవుడ్ సినిమా… ఎన్టీఆర్ ఎంట్రీ… ఆర్ ఆర్ ఆర్ రిలీజ్

కరోనా కారణంగా ఇంటికి పరిమితం అయిన ఎన్టీఆర్, ఒక హాలీవుడ్ పత్రికతో మాట్లాడుతూ 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాని ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదని ఎన్టీఆర్ తేల్చి చెప్పారు. విజువల్ వండర్స్ గా నిలిచిన అవేంజర్స్, జురాసిక్ పార్క్, బాహుబలి లాంటి భారీ సినిమాలని థియేటర్లలో చూస్తేనే మజా వస్తుందన్న ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా కూడా అలాంటి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏ ఇస్తుంది కాబట్టి అందరూ థియేటర్లలో చూడాలని తేల్చి చెప్పేసాడు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ గురించి అనుమానాలు ఉన్న సందర్భంగా దానిపై క్లారిటీ ఇస్తూ అక్టోబర్ 13వ తేదీన రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని ఎన్టీఆర్ చెప్పాడు.

డైరెక్షన్ ఆలోచన ఇప్పటికైతే లేదు కానీ మంచి కథలను నిర్మించాలనే ఆలోచన ఉందని ఎన్టీఆర్ చెప్పాడు. ఇక హాలీవుడ్ లో అవకాశం వస్తే ఓకే చేయడానికి రెడీగా ఉన్నారా అనే ప్రశ్నకి, అక్కడ అవకాశం వస్తే తనకి నటించాలని ఉందని ఎన్టీఆర్ తన మనస్సులోని మాట బయటపెట్టారు. ఇక తన తర్వాతి సినిమాల గురించి చెప్పిన తారక్, కొరటాల ప్రశాంత్ నీల్ చిత్రాలు లూప్ లైన్ లో ఉన్నాయన్నారు. ఇక్కడ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు గురించి ప్రస్తావించకపోవడం కొందరిని ఆశ్చర్యపరిచింది. స్పోర్ట్స్ డ్రామాగా ఎన్టీఆర్ బుచ్చిబాబు సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటూ ఉన్నారు మరి ఇది ఉందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.