కోలీవుడ్ కోడలిని అవుతా… నేషనల్ క్రష్ స్టేట్మెంట్

నేషనల్ క్రష్ గా అన్ని సౌత్ ఇండస్ట్రీస్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న హీరోయిన్ రష్మిక మందన్నా. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంటూ బిజీ బిజీగా ఉన్న ఈ కన్నడ బ్యూటీ, రీసెంట్ తమిళ్ లో కూడా అడుగుపెట్టింది. కార్తీ నటించిన సుల్తాన్ సినిమాతో తమిళనాట అడుగుపెట్టిన రష్మిక, పక్కా పల్లెటూరి అమ్మాయిగా నటించింది. ఈ షూటింగ్ సమయంలో అక్కడి సంస్కృతి, సాంప్రదాయం, భోజనం ఎంతగానో ఆకర్షించాయట. అందుకే పెళ్లి చేసుకుంటే తమిళ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాననే స్టేట్మెంట్ ఇచ్చేసింది.

రష్మిక ఈ మాట అనగానే కోలీవుడ్ ఫ్యాన్స్ అందరూ ఖుషి అవుతున్నారు. కన్నడలో కెరీర్ ప్రారంభించి, తెలుగులో స్టార్ డమ్ పొంది, ఇప్పుడు కోలీవుడ్ కి కోడలిని అవుతా అంటున్న రష్మిక… ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ పక్కన పుష్ప మూవీలో నటిస్తోంది. రెండు భాగాలుగా రానున్న పుష్పతో రష్మిక రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.