భాయ్ దెబ్బకి అన్నీ క్రాష్ అయ్యాయి…

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, డైరెక్టర్ ప్రభుదేవా కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘రాధే’. జీ యాప్ లో పే ఫర్ వ్యూ బేసిస్ లో ఈద్ సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ సినిమా జీ 5లో మధ్యాహ్నం 12 గంటలకు స్ట్రీమ్ అయ్యింది. సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరో నటించిన సినిమా విడుదల అవ్వడంతో పే పర్ వ్యూ అయినా సరే అభిమానులు ఎగబడి జీ 5 యాప్ ని ఓపెన్ చేశారు దీంతో యాప్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. దాదాపు 1.5 మిలియన్ పైగా వ్యూయర్స్ ఒక్కసారిగా హిట్స్ చేయడంతో యాప్ క్రాష్ అయ్యే పరిస్థితి వచ్చింది. అప్పటికప్పుడు యాప్ ని మళ్లీ రెడీ చేశారు.

స్ట్రీమింగ్ లో రాధే సినిమా చూసిన వాళ్లు క్రాష్ అయినప్పుడే బాగుండేది సినిమా చూడకుండా అయినా ఉండే వాళ్లం అనే కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుదేవా సౌత్ సినిమాల నుంచి చాలా సీన్స్ తీసుకోని ఈ సినిమా చేశాడు, మోస్ట్ వాంటెడ్ భాయ్ అంటూ సల్మాన్ కి మరో ఫ్లాప్ ఇచ్చాడు అంటూ రివ్యూస్ ఇస్తున్నారు. ఇంట్రడక్షన్ సీన్ కే సినిమా ఎలా ఉండబోతుందో అర్ధం అయిన అభిమానులు, సల్మాన్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీగా తేల్చి పడేశారు. సల్మాన్ క్రేజ్ వల్ల ఈ సినిమా భారీ స్థాయిలో వ్యూస్ ని రాబట్టింది కానీ థియేటర్స్ లో అయితే డిజాస్టర్ గా నిలిచేది అంటూ విమర్శిస్తున్నారు. మొత్తానికి జీ5 యాప్ కే కాదు సినీ అభిమానులకి కూడా రాధే పెద్ద షాకే ఇచ్చింది.