స్టార్ హీరోయిన్ కి, ఈఎమ్ఐ బాధలు… బాయ్ ఫ్రెండ్ తో సరదాలు

లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ శ్రుతీహాసన్‌. ఈ ఇయర్ క్రాక్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శృతి, ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ మూవీలో నటిస్తోంది. కరోనా కారణంగా షెడ్యూల్స్ బ్రేక్ రావడంతో ఇంటికే పరిమితం అయినా ఈ స్టార్ హీరోయిన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవలే షూటింగ్ కి బ్రేక్ వస్తే అందరిలాగే తనకి కూడా ఫైనాన్సియల్ ట్రబుల్స్ ఉంటాయని శృతి హాసన్ పోస్ట్ చేసింది. విషయం ఏంటంటే శృతి ఒక ఇళ్లు కొనింది దాని షూటింగ్ కి బ్రేక్ వస్తే దాని ఈఎమ్ఐ కట్టడం పెద్ద సమస్యగా మారుతుంది. కమల్ హాసన్ కూతురికి ఆర్ధిక సమస్యలా అని చాలా మంది అనుకున్నారు కానీ ఇండిపెండెంట్ గా ఉండాలి అనుకునే వారికి ఇలాంటి సమస్యలు మాములే.

ఇక శృతి లేటెస్ట్ ఇన్స్టా పోస్ట్ విషయానికి వస్తే డూడుల్‌ ఆర్టిస్ట్‌గా పేరున్న శాంతను హజారికాతో శ్రుతీ క్లోజ్‌ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలూ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలకి బలం చెరుకూర్చేలా శాంతనుతో ఉన్న ఉన్న ఫోటోలని పోస్ట్ చేసింది. లాక్‌డౌన్‌ టైమ్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో లాక్‌ అయ్యానంటూ శృతి షేర్‌ చేసిన ఫొటోస్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. ఇద్దరూ ఎంత సేపు సమయం గడుపుతారు అని నెటిజన్ అడిగిన ప్రశ్నకి ”ప్రస్తుతం 24 గంటలు శాంతనుతోనే గడుపుతున్నాను. ఈ సమయంలో నేనే వంట చేస్తున్నా. శాంతను ఆలూ కర్రీ మాత్రం చేస్తాడు. తను పాలు, పంచదార లేకుండా అస్సాం టీ తాగుతాడు. నాకు మాత్రం టీలో అన్నీ ఎక్కువ ఉండాలి” అని శ్రుతీహాసన్‌ చెప్పుకొచ్చింది. ఇన్‌స్టాలో ఈ ఫొటోలు చూసి స్టార్ హీరోయిన్ తమన్నా ‘క్యూటీస్‌’ అని కామెంట్‌ చేయడం విశేషం.