సమ్మర్ ఇండియన్ మార్కెట్ టార్గెట్ చేస్తున్న బ్లాక్ విడో

హాలీవుడ్ సినిమాలకి ఇంధన మార్కెట్ లో భారీ మార్కెట్ ఉంది. ముఖ్యంగా సూపర్ హీరో సినిమాలకైతే మన స్టార్ హీరోస్ మూవీస్ రేంజ్ బజ్ ఉంటుంది. అవెంజర్స్ అవతార్ లాంటి సినిమాలే ఇందుకు ఉదాహరణ. టెనెట్ మన మార్కెట్ ని అంతగా అట్రాక్ట్ చేయలేదు కానీ మార్వెల్ సంస్థ మరోసారి తన సత్తా చూపించడానికి రెడీ అవుతోంది.

మార్వెల్‌ ప్రొడక్షన్స్ మరో సూపర్‌ హీరో సినిమాని రిలీజ్ చేయడానికి సిద్దమయ్యింది అదే ‘బ్లాక్‌ విడో’. స్కార్లెట్‌ జాన్సన్‌, రేచల్‌ వైష్‌, ప్లోరెన్స్‌ ప్యూ, డేవిడ్‌ హార్బర్‌ లాంటి స్టార్ యాక్టర్స్ నటించిన ఈ మూవీని ఇంగ్లీష్ తో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ గా బ్లాక్ విడో మూవీని జూలై 9న సినిమా విడుదల చేస్తున్నారు.