పెద్ద సినిమాలు చేయలేనిది వార్ చేసి చూపిస్తోంది

హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వార్ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. టైగర్ ష్రాఫ్, హ్రితిక్ రోషన్ హీరోలుగా నటించిన వార్ సినిమా మొదటి రోజు 53 కోట్లు రాబట్టి 2019లో హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇద్దరు హీరోల కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన వార్ సినిమా, రెండో రోజు కూడా అదే జోష్ కంటిన్యూ చేస్తూ వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. వర్కింగ్ డే అయినా కూడా వార్ స్పీడ్ మాత్రం తగ్గలేదు, రెండో రోజు ఇండియా వైడ్ వార్ సినిమా 23 కోట్ల వసూళ్లు రాబట్టింది.

ఒక ఇండియన్ సినిమా నాన్ హాలిడే రోజు, అది కూడా సెకండ్ డే 20 కోట్లు రాబట్టడం ఇదే మొదటిసారి. బాహుబలి లాంటి భారీ సినిమాలకి మాత్రమే అది సాధ్యం అయ్యింది. అలాంటిది వార్ ఈ ఫీట్ ని ఈజీగా అందుకుంది. మొత్తం మీద రెండు రోజులకి కలిపి వార్ సినిమా 77.70కోట్లు రాబట్టింది. ఈరోజు నుంచి 200 థియేటర్స్ పెరగడంతో వార్ జోష్ మరింత పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే జోష్ ని కంటిన్యూ చేస్తూ వార్ ఫస్ట్ వీకెండ్ కి ఎంత రాబడుతుందో చూడాలి.