కొత్త దర్శకుడితో కొత్త సినిమా

కెరీర్ స్టార్టింగ్ నుంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న హీరో శ్రీ విష్ణు. ఈ ఏడాది బ్రోచేవారెవ‌రురా సినిమాతో మంచి స‌క్సెస్ అందుకున్న శ్రీ విష్ణు, ఆ మూవీకి డైరెక్టర్ గా చేసిన వివేక్ ఆత్రేయ శిష్యుడి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొత్త కాన్సెప్ట్స్‌ తో వచ్చే యంగ్ ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేయ‌డానికి ఇష్ట‌ప‌డే శ్రీవిష్ణు, వివేక్ ఆత్రేయ అసిస్టెంట్ హాసిత్ గోలి చెప్పిన కాన్సెప్ట్ నచ్చడంతో అతనితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ సినిమా, డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. త్వ‌ర‌లోనే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో ప్ర‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ నుంచి వస్తున్న సమాచారం. ఇదిలా ఉంటే శ్రీ విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ తిప్పరా మీసం. రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా టీజర్ మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకోని తిప్పరా మీసం త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.