ఎఫ్ ఎన్ సి సి కమిటీ సభ్యులు చేతుల మీదగా మే డే సందర్భంగా ఉద్యోగులకు సత్కారం

నేడు మే డే సందర్భంగా ఎఫ్ ఎన్ సి సి ఎంప్లాయిస్ వారి ఫ్యామిలీస్ అందర్నీ ఘనంగా సత్కరించిన కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ మాగంటి మురళీమోహన్ గారు, శ్రీ నారాయణ మూర్తి గారు, శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు, హీరో శ్రీ శ్రీకాంత్ గారు, FNCC ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కే. ఎల్. నారాయణ గారు, నిర్మాత శ్రీ కె. ఎస్. రామారావు గారు, FNCC ప్రెసిడెంట్ శ్రీ ఆదిశేషగిరిరావు గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ టి. రంగారావు గారు, సెక్రటరీ శ్రీ ముళ్లపూడి మోహన్ గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు గారు, ట్రెజరర్ శ్రీ బి. రాజశేఖర్ రెడ్డి గారు, కమిటీ మెంబర్స్ శ్రీ ఏడిద సతీష్ గారు, బాలరాజు గారు, మరియు కల్చరల్ కమిటీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా FNCC ప్రెసిడెంట్ శ్రీ ఆదిశేషగిరిరావు గారు మాట్లాడుతూ : FNCC సంస్థ 1993 జూన్ లో స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు పనిచేస్తున్న ఎంప్లాయిస్ ఉన్నారు. అదేవిధంగా మధ్యలో జాయిన్ అయ్యే నమ్మకంగా ఈరోజు వరకు ఎంప్లాయిస్ కూడా ఉన్నారు. ఈ రోజున FNCC లో ఇన్ని కార్యక్రమాలు జరిగి ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయ్. కావున ఈరోజు మే డే సందర్భంగా ఎంప్లాయిస్ అందర్నీ సత్కరించుకోవాలని కమిటీ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయిస్ నుంచి ఇదే సపోర్ట్ రానున్న సంవత్సరాల్లో కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము అని అన్నారు.

సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి గారు మాట్లాడుతూ : మే డే అంటే కార్మికుల దినోత్సవం. ఎప్పటినుంచో పనిచేస్తున్న ఎంప్లాయిస్ అందరిని సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మే డే అంటే హాలిడే ఇవ్వడమే కాకుండా ఎంప్లాయిస్ ని మరియు వాళ్ళ ఫ్యామిలీస్ ని పిలిచి మంచి హాస్పిటాలిటీ తో సత్కరించాలని కమిటీ అనుకోవడం దానికి తగినట్టుగా అందరిని సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. శ్రీ మురళీమోహన్ గారు, శ్రీ ఆర్.నారాయణమూర్తి గారు, మిమిక్రీ ఆర్టిస్ట్ శ్రీ శివారెడ్డి గారు ఆధ్వర్యంలో ఎంప్లాయిస్ ని సత్కరించుకోవడం వాళ్ళందరూ సపోర్ట్ చేయడం చాలా మంచి విషయం. ఇలా ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఎంప్లాయిస్ ని సత్కరించుకోవడం ఇదే మొదటిసారి. ఎంప్లాయిస్ అందరూ ఫ్యామిలీతో వచ్చి ఈవెంట్ ని సక్సెస్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన ముఖ్య అతిథులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.

మురళీమోహన్ గారు మాట్లాడుతూ : FNCC కమిటీ ఇలా ఎంప్లాయిస్ ని సత్కరించుకోవడం వాళ్ళ ఫ్యామిలీస్ని పిలిచి ఈవెంట్ ఆర్గనైజ్ చేసి అంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు యాక్టివిటీస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసిన కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలుపుతున్నాను అన్నారు.

ఆర్.నారాయణమూర్తి గారు మాట్లాడుతూ : మే డే అంటే కార్మికులకు హాలిడే ఇవ్వడం కాకుండా ఒక మేనేజ్మెంట్ ఇలా నమ్మకంగా పనిచేస్తున్న ఎంప్లాయిస్ ఫ్యామిలీస్ ని పిలిచి సత్కరించడం ఇండస్ట్రీకి చాలా మంచి విషయం. మంచి భోజనం అలాగే సెలబ్రిటీతో సత్కరించుకోవడం ఇలా ఫ్యామిలీస్ కి ఊరట ఇవ్వడం శుభ సూచకంగా భావించవచ్చు. ఇంక ముందు ముందు కూడా ఇండస్ట్రీలో మిగతా ఆర్గనైజేషన్స్ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. 1993లో స్థాపించిన ఈ ఈ కమిటీ నుంచి ఇలా ఎంప్లాయిస్ ని వారి ఫ్యామిలీస్ని సత్కరించుకోవడం అదేవిధంగా ఎన్నో ఆక్టివిటీస్ ని నిర్వహిస్తూ ముందుకెళ్లడం FNCC సక్సెస్ కి నిదర్శనం అని అన్నారు.

శివారెడ్డి గారు మాట్లాడుతూ : నా మిమిక్రీని ఇంతగా ఆదరించిన ఎంజాయ్ చేసిన ఫ్యామిలీస్ కి ధన్యవాదాలు. ఇలా ఈవెంట్ కి నన్ను పిలవడం, అందరితో కలిసి భోజనం చేయడం, అందరితో కలిసి ఈవెంట్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా FNCC ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.