పలాస 1978 టీజర్ లాంచ్ చేసిన డాషింగ్ డైరెక్టర్

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘‘పలాస 1978’’ . తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. డైరెక్టర్ కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రియలిస్టిక్ అప్రోచ్ తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ :

“ఇలాంటి గ్యాంగ్ స్టర్ కథలు అంటే నాకు చాలా ఇష్టం. అందరూ తిడుతున్నారని గ్యాంగ్ స్టర్ కథలు తీయడం లేదు. కానీ పలాస ట్రైలర్ చూస్తుంటే నాకు చాలా చాలా నచ్చింది. హీరో, హీరోయిన్ బాగున్నారు. ఇందులో కనిపించిన ప్రతి క్యారెక్టర్ చాలా కన్విన్స్ గా ఉంది. దర్శకుడు కరుణ కుమార్ వర్క్ చాలా బాగుంది. పలాస పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ” అన్నారు.

దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ. ‘‘ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. చిత్ర కథాంశం గురించి తెలిసిన చాలామంది ఈ సినిమా కోసం ఆరా తీస్తున్నారు. ఇటీవలే విడుదలై న ” ఓ సొగసరి” అనే పాటకు మంచి స్పందన లభించింది.మా టీజర్ ను పూరీ గారు లాంచ్ చేయడం మా అదృష్టం.ఆయనకు టీమ్ తరపున ధన్యవాదాలు.అందరికీ మా టీజర్ నచ్చుతుందని ఆశిస్తున్నా.పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం.

రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : రఘు కుంచె,
పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా,
నిర్మాత : ధ్యాన్ అట్లూరి.
రచన- దర్శకత్వం : కరుణ కుమార్.