మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ను చిత్ర బృందం పూర్తి చేసుకుంది. చిరంజీవి, త్రిష కృష్ణన్ తదితరులు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్స్, పాట, యాక్షన్‌ బ్లాక్‌ని చిత్రీకరించారు.

చిరంజీవి నివాసంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో సహా మొత్తం బృందంతో పాటు త్రిష కృష్ణన్ కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. “ఇదొక లెజెండరీ, అద్భుతమైన రోజు! #విశ్వంభర” అని ఆమె పోస్ట్ చేశారు. చిరంజీవి, త్రిష, వశిష్ట, కీరవాణి, విక్రమ్, వంశీ, ఛోటా కె నాయుడు, ఎఎస్ ప్రకాష్‌ కనిపిస్తున్న మరో పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిచ్ ప్రొడక్షన్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో అద్భుతంగా వుండబోతోంది. కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్‌ కామిరెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ శివశక్తి దత్తా, చంద్రబోస్ లిరిక్ రైట్స్ కాగా, శ్రీనివాస్ గవిరెడ్డి, గంటా శ్రీధర్, నిమ్మగడ్డ శ్రీకాంత్, మయూఖ్ ఆదిత్య స్క్రిప్ట్ అసోసియేట్‌లుగా ఉన్నారు. విశ్వంభర 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్

సాంకేతిక విభాగం:
రచన & దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి
డీవోపీ: చోటా కె నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి
సాహిత్యం: శ్రీ శివ శక్తి దత్తా,  చంద్రబోస్
స్క్రిప్ట్ అసోసియేట్స్: శ్రీనివాస్ గవిరెడ్డి, గంటా శ్రీధర్, నిమ్మగడ్డ శ్రీకాంత్,  మయూఖ్ ఆదిత్య
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కార్తీక్ శబరీష్
లైన్ ప్రొడ్యూసర్: రామిరెడ్డి శ్రీధర్ రెడ్డి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో