రజాకర్ సినిమా నిర్మాతకు బెదిరింపు కాల్స్

ఇటీవలే రిలీజ్ అయినా రజాకర్ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది. స్వతంత్రం నాటి కొన్ని నిజసన్నివేశాలను, అప్పట్లో తెలంగాణ ప్రాంతంతో పాటు చుట్టూ పక్కల రజాకార్ల పాలనను చూపిస్తూ వారి అరాచక పాలన ఎలా ఉండేదో కళ్ళకు కట్టినట్లు చూపించేలా ఈ సినిమా తీయడం జరిగింది. అయితే ఈ సినిమా నిర్మించిన గూడూరు నారాయణ బీజేపీ నేత అని అందరికి తెలిసిందే. దానితో గూడూరు నారాయణ గారికి బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి. రజాకర్ సినిమా విజయవంతంగా థియేటర్లలో ముందుకు సాగుతుండగా నిర్మాతకు ఇటువంటి బెదిరింపు కాల్స్ రావడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే 1100 పైగా బెదిరింపు కాల్స్ రాగ గూడూరు నారాయణ గారు కేంద్ర ప్రభుత్వం ఆయనకు సెక్యూరిటీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం 1+1 CRPF సెక్యూరిటీ ఇస్తూ గూడూరు నారాయణకు భద్రత కల్పించడం జరిగింది.