మరో బయోపిక్ లో బాలన్…

తెలుగు, హిందీ భాషల్లో బయోపిక్ చిత్రాల హవా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఇదే కోవలో మరో సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. మ్యాథమెటికల్ జీనియస్ గా పేరు తెచ్చుకున్న శకుంతలాదేవిపై ఈ బయోపిక్ ప్రారంభమైంది. లండన్ లో ప్రారంభమైన ఈ బయోపిక్ లో విద్యాబాలన్ టైటిల్ రోల్ లో నటిస్తోంది. అను మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లాంచ్ సందర్భంగా చిత్ర యూనిట్ శకుంతల దేవి బయోపిక్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విద్యాబాలన్… “ఈ కొద్ది నెలల గ్యాప్ లో నా గురించి నేను తెలుసుకున్నా. మ్యాథ్స్ లో ఇంత గొప్ప మేధావి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను. హ్యూమన్ కంప్యూటర్ అన్న పేరు శకుంతలకు ఎలా వచ్చిందో తెలుసుకున్నా. ఆ తర్వాత ఆ పాత్రపై మక్కువ పెరిగింది. ఈ కథను ఇష్టపడడానికి కారణం పాత్ర స్వభావం. అయస్కాంతం లాంటి ఆకర్షణ కలిగి ఉన్న పాత్ర ఇది. తన జీవితం ఎంత ప్రభావవంతమైంది అన్నది” తనని ఎంతగానో ఆకర్షించిందని చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.