కేసుల కోసం ఆఫర్లు…

నిను వీడని నీడను నేనే సినిమాతో మంచి హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయిన హీరో సందీప్‌ కిషన్‌. స్పీడ్ పెంచిన సందీప్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌. ఈ సినిమాతో హన్సిక మోత్వానీ, చాలా రోజుల తర్వాత తెలుగు తెరపై మెరవనుంది. కామెడీ అండ్ కన్ఫ్యూషన్ చిత్రాలకి కెరాఫ్ అడ్రెస్ గా మారిన దర్శకుడు జి నాగేశ్వరరెడ్డి తెనాలి రామకృష్ణ సినిమాను తెరకెక్కించారు. ఎస్‌ఎన్‌ఎస్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ విడుదల చేశారు. కేసుల్లేని లాయర్ పాత్రలో సందీప్ కిషన్ తనలోని ఫన్ సైడ్ ని ఫుల్ లెంగ్త్ లో బయటకి తీశాడు. టీజర్ చాలా ఫన్నీగా కట్ చేశారు. ముఖ్యంగా కేసుల కోసం సందీప్ కిషన్ ఇచ్చే ఆఫర్స్ బాగున్నాయి. ఫన్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్న ఈ తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌ సినిమా ప్రేక్షకులని అలరించి సందీప్ కిషన్ కి మరో హిట్ ఇస్తుందేమో చూడాలి.