నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న టాప్ 15 బెస్ట్ సినిమాలు ఇవే

ఒకప్పుడు సినిమాలు చూడాలంటే థియేటర్లకు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ప్రస్తుతం టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రతీది క్షణాల్లో ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి వస్తుంది. తప్పనిసరిగా థియేటర్లకు వెళ్లే సినిమా చూడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్‌గా మన చేతుల్లో ఉండే స్మార్ట్‌ఫోన్‌లోకే కొత్త కొత్త సినిమాల్లోకి వచ్చేస్తున్నాయి.

netfilx best te;ugu movies

ప్రస్తుతం అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, ఆహా లాంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ ప్రేక్షకులను కొత్త సినిమాలను అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. తక్కువ ధరకే ఈ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ మెంబర్‌షిప్ అందిస్తూ ప్రేక్షకులు కొత్తగా విడుదలయ్యే మంచి మంచి సినిమాలు చూసే అవకాశాన్ని ఇవి కల్పిస్తున్నాయి.

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 15 బెస్ట్ సినిమాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

నితిన్-రష్మిక మందన్నా కాంబోలో వచ్చిన ‘భీష్మ’ సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో నితిన్, రష్మీక మధ్య సాగే లవ్ ఎపిసోడ్‌తో పాటు రెండు కంపెనీల మధ్య సాగే వార్ చాలా బాగుంటుంది. ఇక అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మ్యూజిక్ హిట్ ‘అల వైకుంఠపురములో’ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. లాక్‌డౌన్‌కు ముందు వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.

ఇక మహేష్ బాబు హీరోగా మురుగుదాస్ తెరకెక్కించిన స్పైడర్ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఇందులో ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా మహేష్ నటన బాగుంటుంది. ఇక తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పిన బాహుబలి, బాహుబలి-2 సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాగే నగరానికి ఏమైంది, నీవెవరో, అడుగో, ఎవరికీ చెప్పొద్దు, ఓ బేబీ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, W/O Ram, ‘అ’. సర్కార్, మను లాంటి హిట్ సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నాయి.