బన్నీ ‘పుష్ప’ న్యూ లుక్ వైరల్

అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఈ షూటింగ్‌కు సంబంధించిన బన్నీ లుక్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. ఇందులో బన్నీ అడవిలోకి వెళుతున్నట్లు కనిపించింది. ఎర్రని చెక్స్ షర్ట్, ఖాకీలు ధరించే పాయింట్ వేసుకుని మోటుగా అల్లు అర్జున్ కనిపించాడు.

allu arjun

బన్నీ అడవిలోకి వెళుతుండగా వెనుక నుంచి ఈ ఫొటో తీశారు. ఇందులో పెద్దగా, రింగులతో ఉన్న జుట్టుతో బన్నీ కనిపిస్తున్నాడు. ఈ లుక్‌ ఇప్పుడు బన్నీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కిస్తుండగా.. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.