అత‌డితో పీక‌ల్లోతు ప్రేమ‌లో ‘ఉయ్యాల జంపాల’ హీరోయిన్

‘ఉయ్యాల జంపాల’‌ హీరోయిన్ అవికా గోర్ మిలింద్ చద్వానీ అనే యువకుడితో పీక‌ల్లోతు ప్రేమలో ఉంది. ఈ విష‌యాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. త‌న ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను తాజాగా అవికా గోర్ సోషల్‌మీడియాలో షేర్ చేసింది. గ‌త కొంతకాలంగా వీరి ప్రేమాయ‌ణం సాగుతుండ‌గా.. ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేద‌ని అవిగా గోర్ చెబుతోంది. ప్రేమ జీవితం ఒక అంద‌మైన అనుభ‌వంతా ఉంద‌ని అంటోంది.

AVIKA GOR

‘నా ప్రార్థనలకి సమాధానం దొరికింది. నాకు నిజమైన ప్రేమ దొరికింది. మనకు నచ్చిన లక్షణాలున్న వ్యక్తి దొరకడం కష్టమని అనుకుంటాం గానీ నాకు మాత్రం అలాంటి వ్యక్తే దొరికాడు. ఇదంతా ఒక కలలా ఉంది. నేను ఎలాంటి భావనకి గురవుతున్నానో అందరూ అదే అనుభూతిని పొందాలని ఆశిస్తున్నా. ఈ బంధం నా జీవితంలో కీలక పాత్ర పోషించబోతోంది’ అంటూ అవికా తన సంతోషాన్ని అభిమానుల‌తో పంచుకుంది.

‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అవికా గోర్.. ఆ సినిమాతో న‌టిగా మంచి పేరు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ‘రాజుగారి గది 3’ సినిమాల్లో న‌టించింది.