‘ఐశ్వర్యా ఛాలెంజ్’ ట్రైల‌ర్ విడదుల

ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఐశ్వర్యా ఛాలెంజ్’ సినిమా ట్రైలర్ విడుదలైంది. సూర్య నిధి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ దీనిని నిర్మించారు. అభినయ్, సుమర్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. అలాగే రచ్చ రవి ఈ సినిమాకు వాయిస్ ఇచ్చాడు. రాజు, హర్ష, మెహన్ రావు, ఐశ్వర్యా ఈ సినిమాలో పాటలు పాడారు.

AISWARYA RAJESH

ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్స్‌లో విడుదల కానుందది. అంతేకాకుండా ఆహా, ఊర్వశి ATTల ద్వారా కూడా దీనిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఐశ్వర్యా ఛాలెంజ్ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

నిర్మాణ, నిర్వహణ వెల్లూరు మధుబాబు మాట్లాడుతూ.. నన్ను నమ్మి రెండో సినిమాకు నిర్మాణ నిర్వహణగా అవకాశం ఇచ్చిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ఎప్ప‌టికీ రుణపడి ఉంటాను. ఆయనతో నా అనుభంధం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను అని చెప్పారు