రికార్డుల సైరా…

సాఫీగా సాగుతున్న సముద్రంలో తుఫాన్ వచ్చినట్లు, ప్రశాంతంగా ఉన్న సోషల్ మీడియాలో సునామీలా వచ్చిన ‘సైరా’ ట్రైలర్ ప్రకంపనలు సృష్టిస్తోంది. విడుదలై 24 గంటలు తిరిగే సరికి ట్రైలర్ రికార్డ్ స్థాయిలో హిట్స్ రాబడుతూ ట్రెండింగ్ లో ఉంది. కేవలం రెండు గంటలలో 20 లక్షల వ్యూస్ రాబట్టిన సైరా ట్రైలర్ ఒకరోజు కూడా పూర్తి కాకుండానే కోటి వ్యూస్ రాబట్టే అవకాశం ఉంది.

ముఖ్యంగా చిరంజీవి ఈ మూవీ ట్రైలర్ లో చెప్పిన డైలాగ్స్ కి ఫిదా అయిన మెగా అభిమానులు రిపీటడ్ గా చూస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా సైరా ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది. సినిమాపై నిన్నటి వరకూ ఉన్న అంచనాలు వేరు, సైరా ట్రైలర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వేరు. కేవలం ట్రైలర్ చూడగానే సినిమాని చూడాలి అనుకున్న వారు కూడా ఉండి ఉంటారు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ట్రైలర్ మరిన్ని రికార్డ్స్ కొట్టే అవకాశం ఉంది.