మరోసారి కాజల్ తో కనిపించనున్న దగ్గుబాటి కుర్రాడు

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ, ప్రతి మూవీకి మార్కెట్ పెంచుకుంటున్న హీరో దగ్గుబాటి రానా. అన్ని ఇండియన్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రానా, ప్రస్తుతం విరాటపర్వం మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోగానే రానా, నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయనున్నాడు. కోరియన్ మూవీని తెలుగు తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి రెడీ అయిన నందిని రెడ్డి, ఈ సినిమాలో రానా పక్కన కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తీసుకోవాలి అనుకుందట. అయితే ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి, డేట్స్ ఖాళీగా లేవ‌ని రానా సినిమాకి చెప్పేసింద‌ట‌. దీంతో ఇప్పుడు కీర్తి సురేష్ ప్లేస్ లో కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇప్పటికే రానా, కాజల్ అగర్వాల్ కలిసి నేనే రాజు నేనే మంత్రి చేశారు. కమర్షియల్ గా మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమాలో కాజల్, రానా మధ్య కెమిస్ట్రీకి మంచి అప్లాజ్ వచ్చింది. మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ అవుతుంది అంటే సినీ అభిమానుల్లో పాజిటివ్ బజ్ ఉంటుంది. మరి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందనే అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.