గుంటూరు పిల్ల… గ్లామర్ డోర్లు తెరిచింది

తెలుగు అమ్మాయిలకి మరీ పద్ధతులు, లిమిటేషన్స్ ఎక్కువ ఉంటాయి అనే ఫీలింగ్ ఇండస్ట్రీలో ఉంది కాబట్టే చిత్ర పరిశ్రమలో మన వాళ్ళకి అవకాశాలు తక్కువగా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతుంటారు. అయితే తెలుగు అమ్మాయిలకి గ్లామర్ హద్దులు ఉంటాయి అనే మాట చెరిపేస్తూ, అచ్చ తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ ఇప్పటికే పలుమార్లు అందాల ప్రదర్శన చేసి చేసి షాక్ ఇచ్చింది. గూఢచారి సినిమాతో తెరపై మెరిసిన గుంటూరు బ్యూటీ తాజాగా మరోసారి హాట్ హాట్ గా ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. ఈ భామ పెట్టిన లేటెస్ట్ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

గుంటూరు మిర్చి కారం లాంటి ఈ భామ ఫొటోలతోనే కుర్రాళ్ళ గుండెల్లో సెగలు రేపుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గూడచారి చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచిన ఈ భామ, ఆ తర్వాత ఏ మూవీ చేయలేదు. ప్రస్తుతం మలయాళంలో కురుప్ సినిమా చేస్తున్న శోభిత, తెలుగులో నిలబడడానికి గ్లామర్ ని నమ్ముకుంది. అందుకే ఈ ఫోటోషూట్స్ చేస్తూ ఇండస్ట్రీ వర్గాల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తుంది. మరి గుంటూరు పిల్లకి తెలుగులో ఛాన్స్ ఇచ్చేది ఎవరో చూడాలి.