లైటింగ్ సూరి బాబు సిక్స్ ప్యాక్ సూపించాడు

టాలీవుడ్ లో ఇప్పుడు ఫిట్ మంత్రా నడుస్తుంది. ఏ యంగ్ హీరోని చూసినా సిక్స్ ప్యాక్, సాలిడ్ బిల్డ్ ఫిజిక్ పై మనసు పారేసుకున్నారు. చిన్నా లేదు పెద్దా లేదు హీరోలంతా ఫిట్నెస్ మంత్రాన్ని జపిస్తున్నారు. అయితే ఈ యంగ్ హీరోస్ లో సుధీర్ బాబు మాత్రం ఎప్పుడూ స్పెషలే. సినిమాతో సంబంధం లేకుండా ఫిట్ గా ఉండడం అతనికి అలవాటు అయిన పని. సుధీర్ బాబు తన ఫిట్నెస్ రేంజ్ ఏంటో మరోసారి చూపించాడు. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు శ్రీ దేవి సోడా సెంటర్ అనే సినిమా చేస్తున్నాడు. హీరో పుట్టిన రోజు సంధర్భంగా చిత్ర యూనిట్ ఒక చిన్న గ్లిమ్స్ ని రిలీజ్ చేసింది.

లైటింగ్ సూరిబాబుగా సుధీర్ మేకోవర్ చాలా కొత్తగా ఉంది. నెవర్ బిఫోర్ రా లుక్ లో కనిపిస్తున్న ఈ యంగ్ హీరో తన లుక్స్ తోనే అందరినీ ఫిదా చేశాడు. ఈ వీడియోకి మణిశర్మ మ్యూజిక్ మరో హైలైట్ గా నిలిచింది. శశిదేవి నిర్మిస్తున్న ఈ శ్రీదేవి సోడా సెంటర్ లో సుధీర్‌బాబుకు జోడీగా కనిపించబోయే అమ్మాయి ఎవరు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.