కోవిడ్ పేషంట్స్ కోసం ప్రభాస్ మూవీ సెట్

కరోనా సమస్త జనాలని ఇబ్బంది పెడుతున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ముందుకి వచ్చి ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి హీరో ప్రజల కోసం ఎదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఈ లిస్ట్ లోకి రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్‌’ చిత్ర యూనిట్ కూడా చేరింది. ‘రాధేశ్యామ్‌’ సెట్స్‌లో ఉపయోగించిన బెడ్లను విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. 1970ల కాలంలో ఉండే ఇటలీ స్టైల్ హాస్పిటల్ ని రాధే శ్యామ్ షూటింగ్ కోసం హైదరాబాద్ లో సెట్ వేశారు. ఈ సెట్ లో వాడిన బెడ్లు, స్ట్రెచర్లు, వైద్య పరికరాలని ఓ కోవిడ్‌ కేర్ సెంటర్ కి విరాళంగా అందించారు. ఇదే విషయాన్ని ఈ చిత్ర ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఆర్‌.రవీందర్‌ రెడ్డి అఫీషియల్ గా తెలిపారు.