మరోసారి టైలర్ మేడ్ పాత్రలో నందమూరి నట సింహం…

రేయ్… గట్టిగా తొడ కొట్టానంటే ఆ సౌండ్ కే గుండె ఆగి ఛస్తావ్ రా

కత్తులతో కాదు రా కంటి చూపుతో చంపేస్తా

ఏ సెంటర్ అయినా ఓకే… ఒక్కడినే వస్తా చెమట పట్టకుండా చంపేస్తా

ఈ డైలాగ్స్ వినగానే ఒక వింటేజ్ బాలకృష్ణ మన కళ్ల ముందు కనిపిస్తాడు. అంత మాస్ హిస్టీరియా క్రియేట్ చేసిన రోల్ లో మరోసారి కనిపించబోతున్నాడా అంటే ఇండస్ట్రీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే,

నందమూరి నట సింహం బాలకృష్ణ… మాములు పాత్రలు సరిపోయే బాడీ కాదు అది. మీసం మెలేయాలన్న ఆయనే, తొడ కొట్టాలన్నా ఆయనే. మాటలో రౌద్రం, మోహంలో రాజసం ఆయనకి మాత్రమే చెల్లిన తేజస్సు. ఇవన్నీ కలగలుస్తాయి కాబట్టే పవర్ ఫుల్ పాత్రలు ఆయన్ని వెతుక్కుంటూ వెళ్తాయి. ముఖ్యంగా ఫ్యాక్షన్ లీడర్ గా, మెలితిప్పిన మీసంతో పోరుషం నిండిన డైలాగులతో బాలకృష్ణ డైలాగులు చెప్తుంటే థియేటర్స్ జై బాలయ్య నినాదాలతో మారు మోగిపోతాయి. సమరసింహా రెడ్డితో మొదలుపెడితే, నరసింహ నాయుడు, చెన్నకేశవ రెడ్డి వరకూ ఫ్యాక్షన్ సినిమా అంటే అది బాలయ్య సినిమానే, సీమ పౌరుషం తెరపై చూపించాలి అంటే బాలయ్య తర్వాతనే అనే పేరు తెచ్చుకున్నాడు. గత కొంత కలాంగా ఫ్యాక్షన్ సినిమాలకి దూరంగా ఉంటూ కమర్షియల్ సినిమాలని మాత్రమే చేస్తున్న బాలకృష్ణ, మరోసారి తన టైలర్ మేడ్ రోల్ లో కనిపించడానికి రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తోన్న బాలకృష్ణ, ఈ సినిమా పూర్తి కాగానే గోపీచంద్ మ‌లినేని డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఇందులో బాల‌య్య డ‌బుల్ యాక్ష‌న్ చేయ‌బోతున్నాడట. ఈ డబుల్ రోల్స్ లో ఒకటి పోలీస్ ఆఫీసర్ కాగా మ‌రోకటి ఫ్యాక్ష‌నిస్టు పాత్ర. ఈ తనదైన ట్రేడ్ మార్క్ రోల్ లో బాలకృష్ణ యాక్టింగ్ ఏ రేంజులో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా.