దేవరకొండ ఫౌండేషన్ కి ప్రొడ్యూసర్ డొనేషన్…

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సినిమాలు చేస్తూ, సోషల్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ యంగ్ హీరో తన ఫస్ట్ ఫిల్మ్ ఫేర్ అవార్డుని కూడా వేలం వేసి ఆ డబ్బులని సీఎం కేర్ ఫండ్ కి డొనేట్ చేశాడు. కరోనా ఫస్ట్ వేవ్ టైములో కూడా విజయ్ చాలా మందికి అండగా నిలిచాడు. రౌడీ వేర్ బ్రాండ్ తో బిజినెస్ చేస్తూనే ‘‘దేవరకొండ ఫౌండేషన్”ని స్టార్ట్ చేసి ఆపదలో ఉన్న వాళ్ళకి తనవంతు సాయం చేస్తున్నాడు. ఈ ఫౌండేషన్ కి ప్రముఖ నిర్మాత గొట్టిముక్కల పాండురంగారావు 2 లక్షలను విరాళంగా ఇచ్చారు. విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన నేడు విజయ్ దేవరకొండ ఫ్యామిలీని కలిసి రెండు లక్షల రూపాయిలను అందజేశారు.

vijay liger budget

ప్రస్తుతం పూరీ జగన్నాధ్ తో కలిసి చేస్తున్న ‘లైగర్’ సినిమాతో ప్యాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసిన దేవరకొండ విజయ్ సాలిడ్ హిట్ కొట్టి వచ్చిన మనీతో మరి కొంత మందిని ఆడుకుంటాడని ఆశిద్దాం.