సోనూసూద్ టైల‌ర్ షాపు.. కానీ నో గ్యారెంటీ!

సోనూసూద్‌ క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో సేవా కార్య‌క్ర‌మాలు, ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకుంటూ ఒక్క‌సారిగా దేశంలో రియ‌ల్ హీరో అయ్యాడు. ఎక్క‌డ ఏ ఆప‌ద ఉన్నా.. నేనున్నాను అంటూ ముందుకు వ‌చ్చి సాయం అందిస్తున్నాడు. వ‌ల‌స కార్మికులు మొద‌లు.. రైతులు, నిరుద్యోగులు ఇలా ప్ర‌తి ఒక్క‌రికి అడిగిన సాయం చేస్తూ న‌లుగురికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఇప్ప‌టికీ త‌న స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను అందిస్తూనే ఉన్నాడు.

sonusood tailoring

సోష‌ల్‌మీడియా ద్వారా నిరుపేద స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని త‌న‌కు వీలైన సాయాన్ని అందిస్తున్న రియ‌ల్ హీరో సోనూసూద్ ఇప్పుడు ఉన్న‌ట్లుండి టైల‌ర్‌గా మారాడు. అయితే అస‌లు విష‌యం ఏంటంటే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కుతున్న ఆచార్య చిత్రంలో విల‌న్ పాత్ర‌లో సోనూసూద్ న‌టిస్తుండ‌గా.. ఇటీవ‌లే ఆ చిత్ర లొకేష‌న్‌లో ఉన్న ఆయ‌న ఓ క్లాత్ తీసుకుని ప్యాంట్ కుట్టేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే అది కాస్త విఫ‌ల‌మైంది. దీంతో ఆ వీడియోను ఫ‌న్నీ కామెంట్‌తో సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. సోనూసూద్ టైల‌రింగ్ షాప్‌.. ఇక్క‌డ దుస్తులు ఉచితంగా కుట్ట‌బ‌డును.. అయితే ప్యాంట్లు నిక్క‌ర్లు అవుతాయేమో.. ఆ విష‌యంలో గ్యారెంటీ లేదు.. అని త‌నపై తానే కామెంట్ రాసి పోస్ట్ చేశాడు సోనూసూద్‌.