మిథున్ చక్రవర్తి ప్రియురాలిగా శృతిహాసన్

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కమల్‌హాసన్ కూతురు శృతిహాసన్.. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటిస్తోంది. అయితే ఇప్పుడు హీరోయిన్లు సిల్వర్ స్క్రీన్‌తో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగా శృతిహాసన్ కూడా ఒక వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఓకే చెప్పేసిందట. అది కూడా ఒక హిందీ వెబ్ సిరీస్‌లో.

SRUTHIHASAN WEB SERIES

ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రియురాలిగా శృతిహాసన్ నటించనుందట. ది బెస్ట్ సెల్లర్ షఈ రోట్ అనే నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మిథున్ చక్రవర్తి నవలా రచయితగా నటించనుండగా.. శృతిహాసన్ ఆయనకు ప్రియురాలిగా నటించనుంది. డైరెక్టర్ ముకల్ అభ్యంకర్ దీనిని తెరకెక్కిస్తున్నారు. సిద్ధార్థ్ పి మల్హోత్రా దీనిని నిర్మిస్తున్నారు.