కత్తితో కేక్ కట్.. క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇవాళ తన పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కత్తితో విజయ్ తలపతి కేక్ కట్ చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై నెటిజన్లు ట్రోల్ చేస్తుండటంతో.. ఎట్టకేలకు సోషల్ మీడియా ద్వారా విజయ్ సేతుపతి స్పందించాడు. తాను ప్రస్తుతం పొన్రామ్ సినిమాలో నటిస్తున్నానని, ఆ సినిమాలోని కత్తి కీలక పాత్రలో ఉండనుందని, అందులో భాగంగానే కత్తితో కేక్ కట్ చేశానన్నాడు.

VIJAY SETUPATI SORRY

దీని వల్ల తాను తప్పుడు సంకేతాలు పంపానని అనుకుంటున్నారని, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానని విజయ్ సేతుపతి స్పష్టం చేశాడు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటానని, ఎవరినైనా బాధపెట్టినట్లయితే క్షమాపణలు అని విజయ్ సేతుపతి తెలిపాడు. ఇవాళ డైరెక్టర్ పొన్రామ్ టీంతో కలిసి విజయ్ సేతుపతి బర్త్ డే సెలబ్రేషన్ జరుపుకున్నాడు. ఈ సందర్భంగా కత్తితో కేక్ కట్ చేయడం వివాదాస్పదమైంది.